- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో రిలీఫ్.. రాకెట్‌లా దూసుకెళ్తున్న బంగారం ధర.. వెండి కూడా..
వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం లేకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి వరుసగా నిరాశే ఎదురవుతోంది. బంగారం, వెండి లోహాలపై ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయాల ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. బంగారంపై ట్యాక్స్ పెంచిన కేంద్రం.. వెండి దిగుమతులకు బ్రేక్ వేసింది. దీంతో ధరల్లో హెచ్చుతగ్గులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా మూడోరోజు బంగారం ధర పెరిగింది. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.490 పెరిగి.. రూ.1,59,930కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 పెరిగి రూ.1,46,660కి జంప్ అయింది.
మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. నిన్న రూ.15,000 తగ్గిన కిలో వెండి ధర.. నేడు రూ.5000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,90,000కు చేరింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఈ రెండు లోహాలతో చేసే ఆభరణాలు, వస్తువులే కీలకం. అలాంటి బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో.. కొనుగోలుదారులు ఎప్పుడు కొనాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లు ఆపాలని దేశ ప్రజలను కోరిన విషయం తెలిసిందే. రెండ్రోజులకే బంగారంపై ట్యాక్స్ ను ఊహించని రీతిలో పెంచేశారు.






