8 రోజుల పతనం తర్వాత బలపడిన రూపాయి మారకం

by Naga Rani Yarlagadda |

గత కొన్ని రోజులుగా వరుస పతనంతో ఆందోళన కలిగిస్తున్న భారత రూపాయి విలువ ఎట్టకేలకు కోలుకుంది.

8 రోజుల పతనం తర్వాత బలపడిన రూపాయి మారకం
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా వరుస పతనంతో ఆందోళన కలిగిస్తున్న భారత రూపాయి విలువ ఎట్టకేలకు కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ వరుసగా 8 రోజుల పాటు క్షీణించిన తర్వాత.. గురువారం నాటి ట్రేడింగ్‌లో మళ్లీ బలపడింది. రూపాయి పతనానికి బ్రేక్ వేస్తూ ఈరోజు 52 పైసలు పుంజుకుంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ96.30 వద్ద స్థిరపడింది.

రూపాయి విలువ ఇంత వేగంగా కోలుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న ఒక కీలక నిర్ణయమే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగి, 5 బిలియన్ డాలర్ల (సుమారు 500 కోట్ల డాలర్లు) విలువైన స్టాక్స్ వేలాన్ని (Auction) అధికారికంగా ప్రారంభించింది. మార్కెట్లోకి డాలర్ల లభ్యతను పెంచడం ద్వారా రూపాయిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఆర్‌బీఐ చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్య తక్షణ ఫలితాన్ని ఇచ్చింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడం, మార్కెట్లో డాలర్ల కొరత తీరడంతో రూపాయి విలువ శరవేగంగా బలపడింది. రానున్న రోజుల్లో ఆర్‌బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటే రూపాయి మరింత పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story