- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
All Time High: బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్న బంగారం.. ఒక్కరోజే రూ.5000పైగా హైక్
బంగారం, వెండి ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేకులు పడే పరిస్థితి కనిపించడం లేదు. అంతర్జాతీయంగా వాటికి ఉన్న డిమాండ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిపైన పెట్టుబడులే సేఫ్ గా భావించి ఇన్వెస్ట్ చేస్తుండటంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేకులు పడే పరిస్థితి కనిపించడం లేదు. అంతర్జాతీయంగా వాటికి ఉన్న డిమాండ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిపైన పెట్టుబడులే సేఫ్ గా భావించి ఇన్వెస్ట్ చేస్తుండటంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మంగళవారం రాత్రి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,780 (Without GST) ఉండగా.. బుధవారం ఉదయానికి ఏకంగా రూ.5 వేలకు పైగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.5020 పెరిగి రూ.1,54,800కు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా ఏకంగా రూ.4600 పెరిగి రూ.1,41,900కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల ధర రూ.3770 పెరిగి రూ.1,16,110కి చేరింది.
ప్లాటినం ధరలకూ రెక్కలు
వెండిధర స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 94 డాలర్ల మార్కును దాటింది. ఔన్సు బంగారం ధర 4849 డాలర్లకు చేరింది. బంగారమే కాదు. ప్లాటినం ధరలు కూడా రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. బుధవారం 10 గ్రాముల ప్లాటినం ధర రూ.3460 పెరిగి రూ.71,780కి చేరింది. జనవరి 11 నుంచి నేటి వరకూ 100 గ్రాముల ప్లాటినం ధర రూ.65,460 వరకూ పెరిగింది.
Read More..






