- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒకేరోజు రెండుసార్లు!
ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆకాశమే హద్దుగా బంగారం ధరలు(Gold Price) దూసుకెళ్తున్నాయి. మనల్ని ఎవడ్రా ఆపేది అనేలా.. ఇవాళ మరోసారి ఆల్ టైమ్ హైని టచ్ చేశాయి. ఉదయం లక్షా 47 వేలకు పైగా ఉన్న ధరలు.. సాయంత్రానికి లక్షా 52 వేలకు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,52,000(జీఎస్టీతో కలిపి)లు దాటింది. దీంతో పాటు సిల్వర్ రేట్లు కూడా పరుగులు పెడుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో కిలో సిల్వర్ ధర రూ.3,39,900(3శాతం జీఎస్టీతో కలిపి) పైనే పలుకుతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో.. సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీంతో వీటిపైకి విస్తృతంగా పెట్టుబడులు వస్తుండగా.. ధరలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.






