- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold prices: ఆకాశన్నంటిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ.20 వేలు పెరుగుదల?
నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఇవాళ(జనవరి 23) భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: గత నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న(జనవరి 22) ఒక్కసారిగా కుప్పకూలాయి. మొన్నటి వరకు వరుసగా బంగారం, వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బంగారం ప్రియులు ఆందోళనకు గురయ్యారు. అమ్మో ఇక బంగారం, వెండి కొనగలమా అనే విధంగా ఖంగుతిన్నారు. ఇక, నిన్న తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఈ క్రమంలో మరోసారి షాకిచ్చాయి. నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఇవాళ(జనవరి 23) భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. ఇక 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర పై రూ.4950 ఎగబాకి రూ.1,46,400 గా ఉంది. ఇక, కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000కు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో భారీ పెరుగుదల ఉంది.
నేడు హైదరాబాద్ లో బంగారం ధర..
22 క్యారెట్ల బంగారం ధర- రూ.1,46,400
24 క్యారెట్ల బంగారం ధర- రూ.1,59,710
నేడు విజయవాడలో బంగారం ధర..
22 క్యారెట్ల బంగారం ధర- రూ.1,46,400
24 క్యారెట్ల బంగారం ధర- రూ.1,59,710
Read More..






