Gold Prices Today: వరుస షాకులిచ్చి.. భారీగా పడిపోయిన బంగారం ధరలు!

by Kodari Anjali |   (  Updated:2026-02-11 13:12:13  IST  )

నిన్న 22 క్యారెట్లు.. 10 గ్రాముల బంగారం రూ.1,43,550 ఉండగా.. నేడు రూ. 2,100 తగ్గి రూ. 1, 41, 450గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,600 గా ఉంది. నేడు రూ.2,290 తగ్గి రూ.1,54, 310 గా ఉంది.

Gold Prices Today: వరుస షాకులిచ్చి.. భారీగా పడిపోయిన బంగారం ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రేకుల్లేకుండా దూసుకెళ్లిన బంగారం ధరలు నేడు శాంతించాయి. గత మూడ్రోజులుగా వరుస షాకులు తిన్న మహిళలకు నేడు కాస్త ఊరట లభించింది. ఇక ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్లు, బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతిరోజూ షాపింగ్ చేసిన బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతారు.

అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా... మరోసారి నిరాశకు గురవుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గగానే డబుల్, త్రిబుల్ ధర పెరుగుతుంది. ఇవాళ గోల్డ్ ప్రియులకు కాస్త ఊరట లభించింది. నిన్న 22 క్యారెట్లు.. 10 గ్రాముల బంగారం రూ.1,43,550 ఉండగా.. నేడు రూ. 2,100 తగ్గి రూ. 1, 41, 450గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,600 గా ఉంది. నేడు రూ.2,290 తగ్గి రూ.1,54, 310 గా ఉంది. కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

హైదరాబాదులో నేటి బంగారం ధర..


22 క్యారెట్ల బంగారం ధర- రూ.1, 41, 450 (నిన్నటి ధర రూ. 1,43,550)
24 క్యారెట్ల బంగారం ధర- రూ.1,54, 310 గా(నిన్నటి ధర రూ. 1,56,600)


విజయవాడలో నేటి బంగారం ధర..


22 క్యారెట్ల బంగారం ధర- రూ.1, 41, 450 (నిన్నటి ధర రూ. 1,43,550)
24 క్యారెట్ల బంగారం ధర- రూ.1,54, 310 (నిన్నటి ధర రూ. 1,56,600)


Read More..

Gold Prices: షాకిచ్చిన బంగారం.. ఒక్కరోజే రూ. 7 వేలు జంప్

Next Story