- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Rate : భారీగా పడిపోయిన బంగారం ధరలు.. నేడు ఒక్కరోజే రూ.9 వేలు ఢమాల్
పెరగడం విరగడం కోసమే అన్న సామెతను నిజం చేస్తూ.. ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు(Gold Rate) నేడు ఒక్కసారిగా నేలకు పడిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్ : పెరగడం విరగడం కోసమే అన్న సామెతను నిజం చేస్తూ.. ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు(Gold Rate) నేడు ఒక్కసారిగా నేలకు పడిపోయాయి. హైదరాబాద్(Hyderabad) నగరంలో బుధవారం సాయంత్రం 5 గం.కు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,25,250 కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.9 వేలు తగ్గడం విశేషం. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,14,843గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పడిపోవడం గమనార్హం. కిలో వెండి రూ.7 వేలు తగ్గింది రూ.1,58,000 కు చేరింది. అయితే గత వారం రోజుల్లో వెండి ధర రూ.28 వేలు తగ్గింది.
ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్స్ లాభార్జన కోసం అమ్మివేయడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త తగ్గడం ఈ తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్సు బంగారం ధర 4,022 డాలర్లకు పడిపోగా... వెండి ధర 47.84 డాలర్లకు చేరింది.
Read More : బంగారం, వెండి ధరల్లో డౌన్ ట్రెండ్ షురూ.. తులంపై రూ.7 వేలు పతనం అయ్యే చాన్స్!






