బంగారం, వెండి ధరల్లో డౌన్‌ ట్రెండ్ షురూ.. తులంపై రూ.7 వేలు పతనం అయ్యే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-22 06:06:14  IST  )

పట్టపగ్గాలు లేకుండా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు డౌన్ ట్రెండ్ మొదలైందా అంటే అందుకు ఔననే సమాధానాలు వస్తున్నాయి.

బంగారం, వెండి ధరల్లో డౌన్‌ ట్రెండ్ షురూ.. తులంపై రూ.7 వేలు పతనం అయ్యే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టపగ్గాలు లేకుండా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు డౌన్ ట్రెండ్ మొదలైందా అంటే అందుకు ఔననే సమాధానాలు వస్తున్నాయి. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. ఔన్స్ బంగారం ధర 220 డాలర్లకు పడిపోయింది. అంటే అక్కడి కరెన్సీలో రూ.4,122 ధర తగ్గింది. ఇక మన కరెన్సీలో తులం బంగారం రూ.7 వేలకు పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఔన్స్ వెండి ధర 3.9 డాలర్లకు క్షీణించి.. 48.39 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో దాదాపు 12 ఏళ్ల తర్వాత 6.3 శాతం గోల్డ్ రేటు తగ్గడం విశేషం. అయితే, బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పతనం కావడం 2013 తర్వాత ఇదే తొలిసారి అని విశ్లేకులు చెబుతున్నారు. ఇప్పుడున్న రేటులో సగానికి సగం పడిపోతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాాబాద్‌లో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,150, క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ.1,17,500 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ.1.65,000లకు చేరింది. మంగళవారంతో పొలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.6 వేలకు తగ్గింది. ఇటీవల రికార్డు గరిష్ఠాలకు చేరిన బంగారం, వెండి లోహాల్లో ఇన్వెస్టర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్‌ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉపశమించడం బంగారం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. దేశీయంగా మంగళవారం బులియన్‌ మార్కెట్లకు సెలవు కావడంతో ధరల మార్పు బుధవారం ఇండియన్ మార్కెట్లో కనపడుతుందని బులియన్‌ విక్రేతలు చెబుతున్నారు.

READ MORE ...

మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్ మేనేజర్ దగా.. కస్టమర్ నగలు అమ్ముకుని పరార్

Next Story