Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం ధర

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-06 05:45:22  IST  )

బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.1800 తగ్గింది.

Gold Rates Today: భారీగా తగ్గిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర.. నేడు కొనుగోలుదారులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.1800 తగ్గి రూ.1,49,130కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1650 తగ్గి రూ.1,36,700వద్ద కొనసాగుతోంది. లైవ్ ట్రేడింగ్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం షాపుల్లో ఈ ధరల్లో హెచ్చుతగ్గులు నమోదు అయ్యే ఛాన్సుంది. ఇక వెండి విషయానికొస్తే.. వరుసగా నాలుగో రోజు స్థిరంగానే కొనసాగుతోంది. సోమవారం కిలో వెండి ధర రూ.2,55,000 గా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మళ్లీ ముదరడంతో ఇన్వెస్టర్లు నష్టాల భయంతో తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుండటంతోనే బంగారం ధర తగ్గుతున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పుంజుకున్న రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే 33 పైసలు లాభం!

రికార్డు స్థాయికి బంగారం దిగుమతులు.. 29% పెరిగిన డిమాండ్

Next Story