- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Price: మళ్లీ గోల్డ్ రేటు క్రాష్.. ట్రంప్ ప్రకటనతో బులియన్ మార్కెట్ షేక్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుద్ధ ప్రకటనతో మళ్లీ బంగారం, ధరలు ఒక్కసారి పడిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు మళ్లీ బ్రేక్ పడింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇరాన్‌పై భీకర యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన బులియన్ మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1,530 తగ్గింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,51,420కు చేరింది. ఆభరణాల తయారీకి వాడే పసిడి ధర రూ.1,400 మేర పతనమై రూ.1,38,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధర రికార్డు పతనం..
బంగారం బాటలోనే వెండి కూడా భారీగా క్షీణించింది. కేజీ వెండి ధరపై ఏకంగా రూ.10,000 మేర కోత పడింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,55,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని చేసిన హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. యుద్ధ భయాల నేపథ్యంలో డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్‌లో మార్పులు రావడం, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడం వంటి కారణాలతో బంగారం ధరలు దిగివచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర తగ్గడంతో సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






