Bitcoin: భారీగా పతనమైన బిట్‌కాయిన్‌.. 2.8 శాతం మేర క్షీణించిన విలువ

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-02 05:29:55  IST  )

ఇరాన్‌పై భీకర దాడులు ఉంటాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో బిట్‌కాయిన్ 66,300 డాలర్ల దిగువకు పడిపోయింది.

Bitcoin: భారీగా పతనమైన బిట్‌కాయిన్‌.. 2.8 శాతం మేర క్షీణించిన విలువ
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఇన్వెస్టర్లన కుదిపేస్తోంది. ఇరాన్‌ (Iran)పై యుద్ధం కొనసాగుతుందని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు మొలైంది. ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్లతో పాటు క్రిప్టో కరెన్సీ మార్కెట్ (Crypto Currency Market) కూడా భారీగా పతనమైంది. అంనంతరం బిట్‌కాయిన్ విలువ 2.8 శాతం మేర క్షీణించి 66,300 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆసియా ట్రేడింగ్‌లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ క్రిప్టోలు కూడా దెబ్బతిన్నాయి. ఈథర్ (Ether) 4.7 శాతం, సోలానా (Solana) 5.1 శాతం మేర నష్టపోయాయి. రిస్క్ అసెట్స్ (Risk Assets) నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో ఆసియా పసిఫిక్ షేర్ ఇండెక్స్ 1.7 శాతం మేర నష్టపోయింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 5 శాతం పైగా పెరిగి బారెల్‌కు 106‌ డాలర్ల మార్కును దాటింది.

మళ్లీ గోల్డ్ రేటు క్రాష్.. ట్రంప్ ప్రకటనతో బులియన్ మార్కెట్ షేక్

Next Story