- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు పెరిగిన గోల్డ్.. ఒక్కరోజే ఏకంగా రూ.7480
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బుధవారం రెండు గంటల వ్యవధిలో బంగారం ధర రెండుసార్లు పెరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బంగారంపై పెట్టుబడులు పెరగడం, మరోవైపు ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు, ప్రపంచవ్యాప్తంగా బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. వీటన్నింటి నేపథ్యంలో బంగారం ధరలు అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్నాయి. బుధవారం రెండు గంటల వ్యవధిలో బంగారం ధర రెండుసార్లు పెరిగింది. ఉదయం 10 గంటలకు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.5020, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.4600 పెరిగింది.
మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి బంగారం ధరలు పెరిగి కొనుగోలు దారులకు షాకిచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2460, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2250 పెరిగింది. దీంతో ఈ ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.7480 పెరిగి రూ.1,57,260కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.6850 పెరిగి రూ.1,44,150కి చేరింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.5000 పెరిగి రూ.3,45,000కు చేరింది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు దాదాపుగా ఇలాగే ఉండనున్నాయి.
త్వరలోనే రూ.2 లక్షలకు బంగారం?
గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో నేషనల్, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లడంతోనే రెండుసార్లు బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, దేశాల మధ్య యుద్ధాలు ఇలాగే కొనసాగితే 10 గ్రాముల బంగారం ధర త్వరలోనే రూ.2 లక్షలు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More..






