- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. వరుసగా ఐదోరోజు బంగారం, వెండి ధరలు పతనం
బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఐదురోజుల క్రితం వరకూ బుల్లెట్ రైలులా దూసుకెళ్లిన ఈ లోహాల రేట్లు.. క్రమంగా దిగి వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఐదురోజుల క్రితం వరకూ బుల్లెట్ రైలులా దూసుకెళ్లిన ఈ లోహాల రేట్లు.. క్రమంగా దిగి వస్తున్నాయి. దీంతో ఆల్ టైమ్ హై రేట్ల వద్ద పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. మరోవైపు బంగారం, వెండి రేట్లు క్రమంగా తగ్గుతుండటంతో కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా ఐదో రోజు బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1420 తగ్గి రూ.1,51,750 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1300 తగ్గి రూ.1,39,100 వద్ద ఉంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1070 తగ్గి రూ.1,13,810కి తగ్గింది. ఈ ధరలకు జీఎస్టీ అదనంగా ఉంటుంది.
వెండి మరోసారి భారీగా పతనమైంది. ఐదురోజుల క్రితం రూ.4,25,000 ఉన్న కిలో వెండి ధర.. ఊహించని రీతిలో పడిపోయింది. నేడు కూడా దేశంలో కిలో వెండిపై రూ.20,000 తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.2,80,000గా ఉంది. అమెరికా భారత్ పై సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. కానీ.. బంగారం, వెండి లోహాలపై తక్కువ రేట్లు ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టినవారంతా లాభాలను తీసుకుంటుండటం, ఫ్యూచర్ ట్రేడింగ్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు చెప్తుండటంతో వీటి ధరలు రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. కానీ.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని, ఇప్పుడు తగ్గినా.. మళ్లీ వాటిపై పెట్టుబడులు పెరిగిన క్రమంలో ధరలు ఊపందుకుంటాయని నిపుణులు చెప్తున్నారు.






