- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Nari Shakti: మహిళలకు ఎలాంటీ పూచీకత్తు లేకుండానే రూ. 2 కోట్ల లోన్ పొందే ఛాన్స్..యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి స్కీం మీ కోసం..!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Nari Shakti) నారీ శక్తి స్కీం:

దిశ, వెబ్ డెస్క్: Union Nari Shakti: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Nari Shakti) నారీ శక్తి స్కీం: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యంగా పారిశ్రామికంగా వారు సొంత కాళ్లపైన స్వశక్తితో నిలబడడానికి కొన్ని రకాల లోన్ స్కీమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో ప్రధానంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ నారీశక్తి స్కీం ప్రధానంగా చెప్పుకోవచ్చు.
ఈ స్కీం ద్వారా మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండానే రెండు లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల వరకు రుణం తీసుకోవచ్చు. ఆపైన 10 కోట్ల వరకు 25 శాతం పూచికత్తు పైన రుణం లభిస్తుంది. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళల ఆధ్వర్యంలో నడిచే MSME పరిశ్రమలకు బ్యాంకు రుణాలను అందిస్తుంది. నారీ శక్తి రుణం స్కీం కంద పరిశ్రమలతో పాటు స్వయం సహాయక గ్రూపులు (SHGs)కు కూడా రుణాలను అందిస్తుంది. ముఖ్యంగా ఈ స్కీం అర్హత గురించి తెలుసుకోవాలంటే మహిళల ఆధ్వర్యంలో నడిచే MSME పరిశ్రములు అంటే కనీసం 51% వాటా మహిళలదే ఉండాలి.
లేదా ఉద్యమ్ నమోదు (Udyam Registration) కలిగిన స్వయం సహాయక గ్రూపులు, SHG గ్రూపులకు రుణం కేటాయిస్తారు. దీనిపై వడ్డీ రేటు ప్రస్తుతం బ్యాంక్ MCLR లేదా EBLR ఆధారంగా నిర్ణయిస్తారు. లోన్స్ విషయానికి వస్తే వ్యక్తిగత మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 2 లక్షల నుండి రూ. 10 కోట్ల వరకు.రుణం అందిస్తారు. స్వయం సహాయక గ్రూపులకు (SHGs) గరిష్టంగా రూ. 20 లక్షలు రుణం అందిస్తారు.
రూ. 2 కోట్ల రుణం వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు, కానీ CGTMSE (క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్) కవరేజ్ ఉండాలి. ఇది భారత ప్రభుత్వం, సిడ్బీ బ్యాంకు ఏర్పాటు చేసిన ట్రస్ట్ దీని ద్వారా మీరు గ్యారంటీ పొందవచ్చు. మరింత సమాచారం కోసం యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా మీకు సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు.
More Information about Loans in Govt బ్యాంక్స్
మహిళలు కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 30 లక్షల లోన్ కావాలా… ఇలా అప్లై చేయండి..






