- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Udyogini Scheme: మహిళలూ.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం అందించే ఒక లక్ష రూపాయల రుణం కావాలా.. ఇలా అప్లై చేయండి
Udyogini Scheme:ఉద్యోగిని పథకం (Udyogini Scheme): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు రూపొందించింది.

దిశ, వెబ్ డెస్క్: Udyogini Scheme: ఉద్యోగిని పథకం (Udyogini Scheme): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు రూపొందించింది. అందులో ముఖ్యంగా కొన్ని పథకాలు వారి స్వావలంబల కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు ఇంటి వద్దనే ఉండి తమ ఉపాధిని పొందేందుకు ఉద్యోగిని స్కీం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడి అవకాశం లభిస్తుంది.
ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఇది చక్కటి స్కీం అని చెప్పవచ్చు. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో పాటు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూడా స్టార్టప్స్ ప్రారంభించేందుకు కూడా ఈ రుణం ఎంత ఉపయోగపడుతుంది. 18 నుంచి 55 సంవత్సరాల మధ్యలో వయసున్న మహిళలు ఈ రుణం అప్లై చేసుకునేందుకు అర్హులు.
అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.40,000 లోపు ఉండాలి. మహిళా స్వయం సహాయ సంఘాలు (SHG), స్వతంత్రంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలు అర్హులు. నిరుద్యోగ మహిళలు, విద్యార్థినులు, ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రుణ పరిమితి రూ.1 లక్ష వరకు ఉంటుంది. వడ్డీ రేటు ఇతర రుణాల కంటే తక్కువగా ఉంటుంది. సబ్సిడీ (Subsidy) పొందే అవకాశమూ ఉంది.
SC/ST, దివ్యాంగులకు సబ్సిడీ మరింత ఎక్కువగా ఉంటుంది. SIDBI (Small Industries Development Bank of India) లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన బ్యాంకులు/నగదు సమితులు వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఆధార్, ఆదాయ సర్టిఫికెట్, చిరునామా ధ్రువీకరణ, ఫొటోలు, వ్యాపార ప్రాజెక్ట్ రిపోర్టు అవసరం. జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) లేదా బ్యాంక్ మేనేజర్ సలహా తీసుకొని పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://udyamimitra.in/ వెబ్ సైట్ క్లిక్ చేయాలి.
మహిళలు కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 30 లక్షల లోన్ కావాలా… ఇలా అప్లై చేయండి.






