Motor Insurance: కార్లకు క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్

by S Gopi |   (  Updated:2025-12-15 11:30:25  IST  )

క్లెయిమ్ ప్రక్రియ కూడా సులభంగా ఉండటంతో పాటు ఇబ్బందులు లేకుండా త్వరగా పూర్తవుతాయి.

Motor Insurance: కార్లకు క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనకు ఆరోగ్య బీమా ఎలాగైతే అవసరానికి ఆదుకుంటుందో, వాహనాలకు సైతం రిపేర్లు వచ్చినప్పుడు, దెబ్బ తిన్నప్పుడు వాహన బీమా ఆర్థిక రక్షణను అందిస్తుంది. సహజ నష్టాలు, మ్యాన్ మేడ్ కలామిటీస్ వంటి సందర్భాల్లో బీమా పనికొస్తుంది. అయితే, గత కొన్నేళ్లలో వాహన బీమాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమా తరహాలో కార్ల మరమ్మత్తు కోసం బీమా సంస్థలు నెట్‌వర్క్ గ్యారేజీలను అందుబాటులో ఉంచుతున్నాయి. దీన్నే నగదు రహిత కారు బీమా కింద అందిస్తున్నాయి. ఈ రకమైన సదుపాయం ద్వారా బీమా కంపెనీలతో లింక్ ఉన్న మెకానిక్ గ్యారేజీలు బీమా తీసుకున్న వారి నుంచి ఎలాంటి సొమ్ము తీసుకోకుండా కార్లను రిపేర్ చేస్తాయి. అందుకైన ఖర్చును బీమా కంపెనీయే భరిస్తుంది. క్లెయిమ్ ప్రక్రియ కూడా సులభంగా ఉండటంతో పాటు ఇబ్బందులు లేకుండా త్వరగా పూర్తవుతాయి. బీమా తీసుకున్న తర్వాత గ్యారేజీల గురించి వివరాలు లేకపోయినా, ప్రమాదం జరిగిన చోటు నుంచి సమీపంలో ఉండే గ్యారేజీ వివరాలను బీమా కంపెనీ కస్టమర్ సపోర్ట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిస్తున్నాయి.

నగదు రహిత కారు బీమా

క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు సమయం, శ్రమను ఆదా చేయడానికి మోటారు బీమా కంపెనీలు అందించే అధునాతన ఫీచర్లలో నగదు రహిత కారు బీమా ఒకటి.

నగదు రహిత కారు బీమా పాలసీ అంటే.

నగదు రహిత కారు బీమా పాలసీ స్వంత జేబు నుంచి ఏమీ చెల్లించకుండా కారును మరమ్మతు చేయించుకునే ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ రకమైన కారు బీమా కింద, బీమా కంపెనీ పాలసీదారు తరపున క్లెయిమ్ మొత్తాన్ని సర్వీస్ ప్రొవైడర్ లేదా గ్యారేజీతో నేరుగా సెటిల్ చేస్తుంది.

నగదు రహిత కారు బీమా అనేది కారు బీమా కంపెనీ అందించే సౌకర్యం. అందుకోసం బీమా కంపెనీలు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ గ్యారేజీలతో ఒప్పందాలు చేసుకుంటాయి. మరమ్మతులకు అయ్యే అన్ని ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది. కొన్ని మినహాయింపులు ఉంటాయి. బీమా కంపెనీతో చర్చించి వివరాలు తెలుసుకోవచ్చు. నెట్‌వర్క్ గ్యారేజీలు కూడా బీమా చేసిన కస్టమర్లకు ప్రాధాన్యత ఇస్తాయి. చెల్లింపులు బీమా కంపెనీలే చేస్తాయి కాబట్టి వారికి ఇది సౌకర్యంగా ఉంటుంది.

ప్రయోజనాలు

కారు బీమా పాలసీ కింద నగదు రహిత క్లెయిమ్‌లను చాలామంది ఇష్టపడుతున్నారు. ఇందులో అనేక ప్రయోజనాలు ఉండటమే ఇందుకు కారణం. అవేంటంటే..

వేగవంతం, సమర్థవంతం: కారు పాలసీకి నగదు రహిత బీమా అంటే క్లెయిమ్‌లు తక్కువ ఫార్మాలిటీలు, పేపర్ వర్క్‌తో పూర్తవుతాయి. మొత్తం ప్రక్రియ సులభంగా, ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది.

పారదర్శకత: కారు బీమాలో, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో పూర్తి పారదర్శకత ఉంటుంది. నెట్‌వర్క్ గ్యారేజీకి కారు మరమ్మతు బిల్లు చెల్లించే మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అందువల్ల, మోసం జరిగే అవకాశాలు తక్కువ.

సౌలభ్యం: నగదు రహిత కారు బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లలో, లావాదేవీలు నెట్‌వర్క్ గ్యారేజ్, బీమా కంపెనీ మధ్య జరుగుతాయి. దీనివల్ల, చెల్లింపుల గురించి ఆలోచించే పని ఉండదు.

సర్వీస్: కారు బీమా కంపెనీలు సాధారణంగా సమీపంలోని మెరుగైన సర్వీస్ అందించే గ్యారేజీలతోనే ఒప్పందం కుదుర్చుకుంటాయి. కాబట్టి, కారు యజమానికి సగం భారం తగ్గుతుంది.

న‌గ‌దు ర‌హిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ

* కారుకు న‌ష్టం జ‌రిగితే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి.

* కారును స‌మీపంలోని నెట్‌వ‌ర్క్ గ్యారేజీకి తీసుకెళ్లాలి. లేదా గ్యారేజీకి తీసుకెళ్లేందుకు బీమాకంపెనీ లేదా కారు గ్యారేజ్ సాయం తీసుకోవచ్చు.

* పాల‌సీకి సంబంధించిన డాక్యుమెంట్లను పూరించి, న‌గ‌దు ర‌హిత మ‌ర‌మ్మ‌తు కోసం ఆ వివరాలను బీమా కంపెనీకి పంపించాలి.

* డాక్యుమెంట్లను ధ్రువీకరించిన తర్వాత బీమా కంపెనీ నెట్‌వ‌ర్క్ గ్యారేజీకి క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ మొదలవుతుంది.

డెబిట్ కార్డుపై బీమా

Next Story