' నేనే నెక్స్ట్ తెలంగాణ సీఎం..' KA Paul

by Chukka Sudharani |   (  Updated:2023-03-20 17:13:19  IST  )

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నన్ను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారు..?' అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు

 నేనే నెక్స్ట్ తెలంగాణ సీఎం.. KA Paul
X

దిశ, నల్లగొండ బ్యూరో: 'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నన్ను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారు..?' అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉపఎన్నిక ఇండిపెండెంట్ అభ్యర్థి కేఏ పాల్ అధికారులతో వాగ్వవాదం చేశారు. కేఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచారం నిర్వహిస్తుండగా, వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కే ఏ పాల్ స్పందిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నేను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్న. నేనే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ మండిపడ్డారు. సదరు అధికారిని నీ పేరు ఎంటంటూ అధికారి మెడలోని ఐడి కార్డు లాక్కొని పేరు చూసే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు.. కేఏపాల్‌కు సర్ది చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి : 'వెంకట్ రెడ్డిని సొంత అన్నగా భావించా.. నాకే వెన్ను పోటు పొడిచాడు'

Next Story