'వెంకట్ రెడ్డిని సొంత అన్నగా భావించా.. నాకే వెన్ను పోటు పొడిచాడు'

by Chukka Sudharani |   (  Updated:2022-10-22 08:02:17  IST  )

'కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సొంత అన్నగా భావించా.. ఆడబిడ్డనని కూడా చూడకుండా అన్న వెంకట్ రెడ్డి వెన్ను పోటు పొడిచాడు.' అంటూ మునుగోడు

వెంకట్ రెడ్డిని సొంత అన్నగా భావించా.. నాకే వెన్ను పోటు పొడిచాడు
X

దిశ, నల్లగొండ బ్యూరో: 'కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సొంత అన్నగా భావించా.. ఆడబిడ్డనని కూడా చూడకుండా అన్న వెంకట్ రెడ్డి వెన్ను పోటు పొడిచాడు.' అంటూ మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి స్పందించారు.

మునుగోడు టికెట్ కోసం వెంకట్ రెడ్డి నాకు చాలా సహకరించాడని, ఆడబిడ్డగా నేను మునుగోడులో ఒంటరి పోరాటం చేస్తున్నానని వెంకట్ రెడ్డి అన్నని ప్రాదేయపడ్డా.. మీరే నాకు ధైర్యం అని కూడా చెప్పా. అయినా ఇంత మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు లో ప్రచారానికి రావాలని వేడుకున్ననాని, వెంకట్ రెడ్డి వైఖరి నాకు బాధేస్తుందన్నారు. నాన్న పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి రాజ్యసభ ఎంపీ‌గా పనిచేశారని, అయినా ఆస్తులు సంపాదించుకొలేదని చెప్పారు. నాకు ఆర్దిక బలం లేకపోవచ్చు.. కానీ ప్రజా బలం ఉందన్నారు. మునుగోడు గడ్డ బిడ్డగా చెబుతున్నా.. ఈ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని తెలిపారు.

ఇవి కూడా చదవండి : ' నేనే నెక్స్ట్ తెలంగాణ సీఎం..'

Next Story