కేసీఆర్‌కు ఊహించని షాక్.. నవంబర్ 4 వచ్చింది మర్చిపోయారా (వీడియో)

by  |
కేసీఆర్‌కు ఊహించని షాక్.. నవంబర్ 4 వచ్చింది మర్చిపోయారా (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళిత బంధు’ పథకం అమలు చేయాలంటూ ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ రావడంతో దళిత బంధు అమలు నిలిచిపోయింది.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ హుజూరాబాద్ దళితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్నిక పూర్తవగానే నవంబర్ 4న నేనే స్వయంగా వచ్చి దళిత బంధు అమలు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ కామెంట్స్‌పై నెటిజన్లు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. నవంబర్ 4 కూడా అయిపోయిందని, మరిచిపోయారా సీఎం సార్.? అంటూ కేసీఆర్ మాట్లాడిన వీడియోను జత చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

గెలుపోటములు పక్కన పెట్టి దళిత బంధును రాష్ట్రమంతటా అమలు చేయాలని, అంతేకాకుండా బీసీ, ఎస్టీ, ఓసీలలోని అర్హులకు బంధును ఇవ్వాలని కామెంట్లలో కోరుతున్నారు.

హరీశ్‌కు షాకిచ్చిన BJP నేత.. దుబ్బాక ఓటమిలోనూ ఆయనదే కీలక పాత్ర.


Next Story

Most Viewed