ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ఇది : CM చంద్రబాబు నాయుడు

by Naga Rani Yarlagadda |

2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ఇది : CM చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస కాండకు స్వస్తి పలికి.. వికాసం వైపు నడిపించాలని ప్రజల ఇచ్చిన తీర్పు వెలువడిన రోజు అని గుర్తుచేసుకున్నారు. ప్రజలు తమకు అప్పగించిందని అధికారాన్ని కాదని, రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యత అప్పగించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం.. ప్రతీక్షణం ప్రజల ఆశలు, ఆంకాక్షలను నెరవేర్చేందుకే పనిచేస్తోందని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్యంగా, ఆర్థికంగా సంతోషంగా ఉండాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు, రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జై ఆంధ్రప్రదేశ్ అంటూ.. ట్వీట్ ను ముగించారు.

Next Story