చార‌కొండ‌లో బీభ‌త్సం సృష్టించిన లారీ..!

by Nallavelli.Anjaneyulu |

చారకొండ మండల కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

చార‌కొండ‌లో బీభ‌త్సం సృష్టించిన లారీ..!
X

దిశ, చారకొండ : చారకొండ మండల కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్ చార్జి ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల వద్ద గుంటూరుకు చెందిన పీరు సాహెబ్ లారీ డ్రైవర్ ఏపీ 3యూ జెడ్ 3489 వాహనం స్పీడ్ బేకర్ వద్ద అతివేగంతో వచ్చిన లారీ ముందుగా అశోక్ లేలాండ్ ఆటోను ఢీకొని తర్వాత కారును ఢీకొంది. అతివేగంతో లారీ బోల్తా పడింది. ప్రమాద స్థలంలో ఉన్న దుకాణం లో ఫర్నిచర్ ధ్వంసం కాగా.. కారు డ్రైవర్ అప్రమత్తమై కారులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆటోలో ఉన్న జమ్ముల బుజ్జమ్మ అనే వ్యక్తికి ఎడమచేయి విరిగి తలకు గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ సిరిగిరి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పాఠశాలకు వేసవి సెలవులు కావడం ప్రమాదానికి ముందే ప్రయాణికులు దేవరకొండ బస్సులో వెళ్లడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. చారకొండ మండల కేంద్రం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటీవల తరచుగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు లో ప్రమాద సూచికలు,సైన్ బోర్డులు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద బైపాస్ రోడ్డు ప్రారంభంలో బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story