- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మసాబ్ ట్యాంక్‌లో బైక్ దొంగల ముఠా అరెస్ట్
ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నలుగురు బాల నేరస్తులను (CCLs) మసాబ్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, హైదరాబాద్ : ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నలుగురు బాల నేరస్తులను (CCLs) మసాబ్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన 10 దొంగిలించిన ద్విచక్ర వాహనాలు, ఒక వాహన ఛాసిస్, ఒక ఇంజిన్‌తో పాటు పలు వాహనాల విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. మసాబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీ గార్డ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్ చర్చ్ ప్రాంతంలో కొందరు అనుమానాస్పద వ్యక్తులు ఓ హోండా డియో స్కూటర్‌కు సంబంధించిన నంబర్ ప్లేట్, రంగును మారుస్తున్నట్లు డయల్-100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా గురువారం మసాబ్ ట్యాంక్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు బాల నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇళ్ల ముందు, రోడ్లపై పార్క్ చేసిన బైకులు, స్కూటర్లను దొంగిలిస్తున్నట్లు అంగీకరించారు. దొంగిలించిన వాహనాలను పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు వాటి రంగులు మార్చడం, నంబర్ ప్లేట్లు తొలగించడం, ఛాసిస్, ఇంజిన్ నంబర్లను తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి మసాబ్ ట్యాంక్‌తో పాటు పటాన్‌చెరు, సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో బాల నేరస్తులను సంబంధిత న్యాయ ప్రక్రియలో భాగంగా జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.






