Monsoon: సూపర్ కూల్ న్యూస్.. రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-04 06:24:09  IST  )

దేశంలో రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మండుటెండలకు ఉపశమనాన్నిచ్చే రుతుపవనాలు వచ్చేశాయి.

Monsoon: సూపర్ కూల్ న్యూస్.. రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మండుటెండలకు ఉపశమనాన్నిచ్చే రుతుపవనాలు వచ్చేశాయి. గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో రుతుపవనాలు కేరళం రాష్ట్ర తీరాన్ని తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. మరికొద్దిరోజుల్లో ఇవి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. అలాగే జూన్ రెండోవారంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం రుతుపవనాలు రాకతో కేరళంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలప్పుజ, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులో ఏకంగా 15 జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవ్వగా.. ఎల్ నినో ఎఫెక్ట్ తో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది.

Next Story