బిగ్ బాస్ బ్యూటీ అరియనా ఇంట్లో దొంగతనం.. ఏం దోచుకెళ్లారంటే..?

by  |
ariyana and soheil news
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియనా గ్లోరి ఇంట్లో దొంగతనం జరిగింది. అరియనా ప్రాణంగా భావించే తన చింటూ ను ఎవరో ఎత్తుకెళ్లారు. బిగ్ బాస్ చూసిన వారందరికీ అరియనా, చింటూల బంధం గుర్తుండే ఉంటుంది. చింటూ అంటే అరియనా కోతి బొమ్మ అని అందరికి తెలిసిందే . ఇక ఈ బొమ్మ వలన అరియనా, సోహైల్ మధ్య ఎన్ని గొడవలు జరిగాయో తెలిసిందే. ఇక తాజాగా సోహైల్ చింటూ పై రివేంజ్ తీర్చుకున్నాడు.

నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు : అరియానాతో ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

https://www.instagram.com/p/CQVOqZwlq_i/

తన బద్ద శత్రువైన చింటూను అరియనా ఇంట్లోనుంచి ఎత్తుకొచ్చాడు. ఇక ఈ విషయాన్ని సోహైల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్తూ.. ‘బిగ్‌బాస్‌లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్‌ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో కు సమాధానంగా అరియనా ” అరేయ్.. నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు” అంటూ సోహైల్ పై ఫైర్ అయ్యింది.

Next Story

Most Viewed