నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు : అరియానాతో ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

by  |
ariyana-rgv 1
X

దిశ, వెబ్‌డెస్క్ : RGV.. ఈ పేరు ఒక్క సినిమా ఇండస్ట్రీలో కాకుండా దేశవ్యాప్తంగా వెరీ పాపులర్.. ఆయన తీసే కాంట్రవర్సీ సినిమాలతోనే అంత క్రేజ్ సంపాదించారనుకోవడంలో అతిశయోక్తి లేదు. సినీ ఇండస్ట్రీలో శివ, రంగీలా వంటి సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చి ఫేమస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్ వర్మ ఆ తర్వాత కొన్నేళ్లపాటు సైలెంట్ అయిపోయారు. తీసిన సినిమాలన్నీ ప్లాఫ్ అవుతూ వచ్చినా మళ్లీ రక్తచర్రిత సిరీస్‌‌తో రీ బౌన్స్ అయ్యారు. అయితే, తాను తీసే సినిమాలు హిట్టా, ఫ్లాప్ అనేది తనకు సంబంధం లేదని.. తనకు నచ్చింది తీస్తానని చెప్పుకోవడం ఒక్క ఆర్జీవీకే చెల్లింది. అంతేకాకుండా తన సినిమా చూడాలని ప్రేక్షకులకు ఎప్పుడూ చెప్పననీ, నచ్చితే వాళ్లే చూస్తారని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.Here's what Ariyana Glory is upto post Bigg Boss Telugu 4 | Times of Indiaఅయితే, ఇటీవల ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. పొలిటికల్ సెటైర్లు వేస్తూనే.. మరోపక్క ‘స్పార్క్’ పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభించి.. అన్ని రకాల కంటెంట్స్‌తో ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నారు. మొన్నది దాకా బోల్డ్ సినిమాల మీద దృష్టి సారించిన ఆర్జీవీ.. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ అరియానాను ఇంటర్వ్యూ చేశారు. జిమ్‌లో జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియాను ఆర్జీవీ నెటిజన్లతో పంచుకున్నారు.

Ariyana meets RGV in Goa | PakkaFilmy‘అరియానా మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు ముందు ఓ సారి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు మీరు నన్ను పొగిడారు. అందువల్లే మళ్లీ మీ రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందని అరియానా చెప్పగా.. అలాంటిదీ ఏమీ లేదని ఆర్జీవీ కుండబద్దలు గొట్టారు. ఆ టైంలో నా మనసుకు ఎదీ అనిపిస్తే అది చెప్పాను. నా పొగడ్తల వల్ల నీకు రియాల్టీ షోలో అవకాశం వచ్చిందంటే నేను నమ్మను’ అని బదులిచ్చారు.

BB Telugu 4 fame Ariyana Glory shares a peek into her next with filmmaker Ram Gopal Varma and fans can't keep calm - Times of Indiaఆ తర్వాత అరియానా మాట్లాడుతూ.. రియాల్టీ షో నుంచి బయటకు వచ్చాక చాలామంది తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారని.. తనకు వర్మతో సంబంధాలున్నాయని చెప్పుకుంటున్నారని అనగానే.. ఆర్జీవీ కలుగజేసుకుని.. ఒక అమ్మాయిని, అబ్బాయినీ ఫ్రెండ్స్ గా చూడలేని వారే ఇలాంటివి సృష్టిస్తారని, అలాంటివి పట్టించుకోవద్దని హితవు పలికారు.

RGV gets trolled for pics with Ariyana | Telugu Cinema

మీరు ప్రజెంట్ నటి అప్సరా రాణీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఏమైనా తనతో రిలేషన్ షిప్‌లో ఉన్నారా అని అరియానా అడగ్గా.. తొలుత షాక్‌కు గురైన ఆర్జీవీ అలాంటిదేమీ లేదని.. తనకు గర్లఫ్రెండ్స్, రిలేషన్ షిప్స్ లాంటివి ఏమీ లేవని వర్మ స్పష్టంచేశారు. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఈ వీడియో చూడండి..



Next Story