- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Electric Bike: ఒక్కసారి ఛార్జ్ చేయండి.. హైదరాబాద్ మొత్తం లవర్తో చుట్టేయ్యండి..సింగిల్ ఛార్జ్ బైక్ పై బిగ్ అప్డేట్..!!
Electric Bike: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ మ్యాటర్ తన ఈవీ మ్యాటర్ ఏరాకు లైఫ్ టైమ్ బ్యాటరీ వారంటీని ప్రవేశపెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: Electric Bike: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ మ్యాటర్ తన ఈవీ మ్యాటర్ ఏరాకు లైఫ్ టైమ్ బ్యాటరీ వారంటీని ప్రవేశపెట్టింది. భారత ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్ విభాగంలో ఇలాంటి వారంటీని అందించడం కూడా ఇదే మొదటిసారని కంపెనీ పేర్కొంది. ఈవీ వెహికల్స్ యజమానులకు ఆందోళన కలిగించే విషయం బ్యాటరీ లైఫ్. బ్యాటరీ రీప్లేస్ మెంట్ ఖర్చులను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది.
ఈవీలో అత్యంత ఖరీదైన కాంపోనెంట్ అయిన ఈ బ్యాటరీని సంస్థ జీవితాంతం కవర్ చేస్తుంది. సాధారణంగా ఈవీ బ్యాటరీలు మూడు నుంచి 8ఏళ్ల వరకు వారంటీలతో వస్తాయి. లైఫ్ టైమ్ వారంటీ ఈ ప్రమాణాన్ని మారుస్తుంది. ఈ మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైకులో 5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జీ చేసినట్లయితే సుమారు 170కిలోమీటర్ల రేంజ్ ను ఇస్తుంది. బ్యాటరీ ప్యాక్, బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టెమ్ సహా కీలక భాగాలను అంతర్గతంగా డిజైన్ చేసి తయారు చేయాలనే నిర్ణయంతో ఈ లైఫ్ టైమ్ వారంటీని అందించే సామర్ధ్యం ఏర్పడిందని పేర్కొంది.
మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ మోటార్ బైక్ సెగ్మెంట్లకు మాన్యువల్ గేర్ బాక్సును పరిచయం చేసింది. ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ తో కనెక్ట్ చేసిన 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను ఎలక్ట్రిక్ బైక్ కలిగి ఉంది. ఈ సెటప్ వైవిధ్యమైన రైడ్ కాంబినేషన్లను అనుమతి ఇస్తుంది. సాంప్రదాయ ఎలక్ట్రిక్ వాహనాల కంటే మరింత డైనమిక్ అనుభవాన్ని కోరుకునే రైడర్లను ఆకర్షించే లక్ష్యంతో ఉంటుంది. మరో ముఖ్యమైన ఫీచర్ లిక్విడ్ కూల్డ్ పవర్ట్రెయిన్ ఇది వేడి పరిస్థితుల్లోనూ మోటార్, బ్యాటరీ పనితీరును నిర్వహించేందుకు అనుమతి ఇస్తుంది. ఈ బైక్ 2.8సెకన్లలో 0 నుంచి 40కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్ షోరూం ధర రూ. 1.83లక్షల నుంచి 1.94 లక్షల మధ్యలో ఉంటుంది.
బైక్ కొనాలనుకునే వారికి సూపర్ న్యూస్ ఇదీ! ఆ బైక్‌పై భారీగా డిస్కౌంట్






