- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ కొనాలనుకునే వారికి సూపర్ న్యూస్ ఇదీ! ఆ బైక్‌పై భారీగా డిస్కౌంట్
స్పోర్ట్స్ బైక్ ప్రియులకు జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునేవారికి జపాన్‌కు (Japan) చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియం మోడల్ స్పోర్ట్స్ బైక్ నింజా జెడ్ఎక్స్-4ఆర్ (Ninja ZX 4R)పై భారీ ఆఫర్ ప్రకటించింది. బైక్ ధర రూ.8.79 లక్షలు (ఎక్స్- షోరూమ్) కాగా.. రూ.40 వేలు డిస్కౌంట్ ఇచ్చి రూ.8.39 లక్షలకు అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ కేవలం మే నెల వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఇక కవాసకీ నింజా జెడ్ ఎక్స్-4ఆర్ బైక్ ఇండియాలోని కవాసకి పోర్ట్ ఫోలియోలాగే రేసింగ్ డీఎన్ఏతో అడుగుపెట్టింది. దీని హ్యాండ్లింగ్ అంతాకూడా నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా జెడ్ఎక్స్-6ఆర్ మాదిరిగానే ఉంటుంది. అలాగే, ఇందులో 399సీసీ, లిక్విడ్- కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్ ఉంటుంది. 77 hp వద్ద 39 Nm టార్క్‌ను ఉత్పత్తి చేశారు. 6-స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. 4.3 అంగుళాల టీఎఫ్టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే, స్పోర్ట్, రోడ్, రైన్, రైడర్ నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లను ఎంచుకొనే సదుపాయం ఉంటుంది. హోండా CBR650R, ట్రయంఫ్ డేటోనా 660, సుజుకీ GSX-8Rలకు పోటీగా నింజా బైక్‌ను కవాసకి భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.






