- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువగళం పాదయాత్ర ఒక చరిత్ర : ఎమ్మెల్యే సోమిరెడ్డి
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచిన యువగళం యాత్ర.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయాల్లో యువగళం యాత్ర ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తికావొస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్రాన్ని నియంతృత్వ పాలన నుంచి విముక్తం చేసేందుకు యువనేత నారా లోకేశ్ బాబు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 'యువగళం' పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా, అక్రమ కేసులతో సీఎం చంద్రబాబు నాయుడుని వైసీపీ పాలకులు ఇబ్బంది పెట్టినా, పవన్ కళ్యాణ్ వంటి నేతలను వేధించినా.. లోకేష్ ఎక్కడా వెనకడుగు వేయకుండా 3,132 కిలోమీటర్ల మేర నడిచి ప్రజల పక్షాన నిలిచారని ఆయన గుర్తుచేశారు. అటు నారా, ఇటు నందమూరి వంశాల రక్తాన్ని పంచుకుని పుట్టిన లోకేశ్, తాతకు తగ్గ మనుమడిగా, తండ్రికి తగిన తనయుడిగా తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నారని సోమిరెడ్డి ప్రశంసించారు. ఇటీవల దావోస్ పర్యటనలో కేవలం నాలుగు రోజుల్లోనే 44 కంపెనీల ప్రతినిధులతో భేటీ అవ్వడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని, అటువంటి యువ నాయకత్వపు బాటలో నడవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.
నారా లోకేశ్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు 3,132 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు సోమిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 29వ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబంలో మూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లోకేష్ బాబు 'డబుల్ ఇంజిన్'లా దూసుకుపోతూ రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేస్తారని తెలిపారు. ఆయనకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నట్లు సోమిరెడ్డి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
READ MORE ....






