- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరముంది : మంత్రి లోకేశ్
83 శాతం కొత్తవారికి పార్లమెంటరీ కమిటీలో అవకాశం కల్పించిన టీడీపీ.

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ (TDP) బలోపేతం అయ్యేందుకు పార్టీలో యువతకు (Youth) అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ పేదరికం లేని సమాజం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అందుకోసం సూపర్ సిక్స్ వంటి పథకాలను సూపర్ హిట్ చేసిందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ, కార్యకర్తలకు సాయం చేయాలని నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రకటించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటోందన్నారు. అన్నదాతకు కష్టం వస్తే ముందుండి వారి కష్టాన్ని తీర్చాలని నేతలకు తెలిపారు.
రాజకీయంగా టీడీపీలో కార్యకర్తలు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పార్టీలో ఉన్న మహిళా నాయకులు, కార్యకర్తలను గౌరవించాలని సూచించారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్లకే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామన్నారు. 83 శాతం మంది కొత్తవారికి పార్లమెంట్ కమిటీల్లో తొలిసారి చోటు కల్పించామన్నారు. పార్టీనే అందరికీ అధినాయకత్వం అని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీకి సేనాధిపతి అన్నారు. టీడీపీ శ్రేణులంతా ఆయన నేతృత్వంలో పనిచేసే సైనికులని మంత్రి లోకేశ్ తెలిపారు. అంజిరెడ్డి, మంజుల, తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. మడమ తిప్పటం, మాట మార్చడం అనే లక్షణాలు టీడీపీ బ్లడ్ లోనే లేవని కుండబద్ధలు కొట్టారు. చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు అందరిపై ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని ఆకాంక్షించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో స్థాయికి వచ్చేలా సంస్కరణలు చేపట్టామని మంత్రి లోకేశ్ ప్రకటించారు.
READ MORE ....






