- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్ల ముగ్గురు లెంపలేసుకోవాలి: వైఎస్ జగన్ సంచలన డిమాండ్
తమ పార్టీ నేతలు ఏం చేశారని ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ...

దిశ, వెబ్ డెస్క్: తమ పార్టీ నేతలు ఏం చేశారని ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్(YSRCP chief YS Jagan) ప్రశ్నించారు. గుంటూరు(Guntur)లో అంబటి రాంబాబు(Ambati Rambabu) కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో ఆయన మాట్లాడతూ సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని ఆరోపించారు. తమ నేతల ఇళ్లపై దాడులు చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడి అత్యంత హేయమైన చర్య అని, వాళ్లు చేసిన తప్పేంటని జగన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఉద్దేశపూర్వకంగా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేశారని జగన్ వ్యాఖ్యానించారు.
కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం
నెయ్యి జంతువుల కొవ్వు కలవకపోయినా తమపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. తిరుమల భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని విమర్శించారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని కేంద్రానికి సంబంధించిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులే రిపోర్టులు ఇచ్చాయని గుర్తు చేశారు. లడ్డూ, నెయ్యి శాంపిల్స్ ను సీబీఐ ఆధ్వర్యంలో అన్ని టెస్టులు జరిగాయని, ఎలాంటి కల్తీ లేదని నివేదికలు ఇచ్చాయని జగన్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లెంపలేసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
అబద్ధం ఎందుకు చెబుతున్నారు..
తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం ఎందుకు అబద్ధం చెబుతోందని అంబటి రాంబాబు ప్రశ్నించారని, అందుకే దాడి చేస్తారా అని జగన్ ప్రశ్నించారు. గుడి దగ్గరకు వెళ్లి వస్తున్న అంబటిపై కర్రలతో అడ్డుకుంటారా అని ఆయన నిలదీశారు. పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు బూతులు తిడుతూ అంబటిపై తెగబడ్డారని మండిపడ్డారు. అంబటిని చుట్టుముట్టిన నేపథ్యంలో అంబటి రాంబాబు నోరు జారారని, వెంటనే ఆయన చింతిస్తున్నా అని చెప్పారని, అయినా కుట్రతోనే దాడి చేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్, లోకేశ్ గతంలో తనను చాలా సార్లు తిట్టారని గుర్తు చేశారు. సీబీఐ ఛార్జిషీట్‌లో నెయ్యి కల్తీ జరగలేదని చెప్పినా.. తమను రెచ్చగొట్టేలా రాష్ట్రమంతా ఫ్లెక్సీలు పెట్టారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై తామూ రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టాలా అని జగన్ నిలదీశారు. ప్రభుత్వ అబద్ధాలు, మోసాలపై ఫ్లెక్సీలు పెడితే ఊరుకుంటారా అని జగన్ ప్రశ్నించారు.






