- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుపరిపాలనను తట్టుకోలేకే.. జగన్ కుట్రలు..!
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టిందుకే ఆయన కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Jagan MOhan Reddy) పరామర్శ నేపథ్యంలో గుంటూరు(Guntur)లో నెలకొన్న పరిస్థితులపై అనగాని సత్యప్రసాద్ స్పందించారు.
సుపరిపాలనపై కుట్రలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, అది చూసి తట్టుకోలేకపోతున్నారని మంత్రి అనగాని మండిపడ్డారు. అందుకే దండయాత్రలకు తన పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. సింగయ్య కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టే వారిని జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపంచారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్యలు చేస్తే.. ఆయన్ను జగన్ వెనుకేసుకొస్తున్నారని మంత్రి అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు.






