నా ప్రియ సోదరుడు విజయ్‌కి అభినందనలు: వైఎస్ జగన్‌

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-04 10:43:26  IST  )

తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి, తన మొట్టమొదటి ఎన్నికల్లోనే విజయ్ నేతృత్వంలోని పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు....

నా ప్రియ సోదరుడు విజయ్‌కి అభినందనలు: వైఎస్ జగన్‌
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilnadu) రాజకీయాల్లో అడుగుపెట్టి, తన మొట్టమొదటి ఎన్నికల్లోనే విజయ్(Vijay) నేతృత్వంలోని పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YSR Congress Party chief YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. "నా ప్రియ సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు" అంటూ జగన్ తన సందేశాన్ని పంచుకున్నారు. తొలి ప్రయత్నంలోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం అద్భుతమని, ఇది విజయ్ పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని జగన్ కొనియాడారు.

ఒక కొత్త అధ్యాయం ప్రారంభం

ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో విజయ్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారని, ఈ ప్రయాణంలో ఆయనకు అపారమైన బలం, విజయం కలగాలని జగన్ ఆకాంక్షించారు. "దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు" అని చెబుతూ విజయ్‌కు అండగా నిలిచారు. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం అధికారం మాత్రమే కాదని, అది నిరంతర ప్రజా సేవ అని జగన్ గుర్తుచేశారు.

రాజకీయ పరిణామాలపైనా...

అదే సమయంలో దేశంలోని ఇతర రాజకీయ పరిణామాలపై కూడా జగన్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) పట్ల తన సానుభూతిని వ్యక్తం చేశారు.. ఎన్నికల్లో రాణించిన బీజేపీ నేతలకు అభినందనలు తెలిపారు. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను గుర్తిస్తూనే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం: సీఎం స్టాలిన్‌‌ను ఓడించిన TVK అభ్యర్థి

Next Story