చంద్రబాబు ఒక గేమ్ ఛేంజర్..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-06 10:54:06  IST  )

చంద్రబాబు ఒక గేమ్ ఛేంజర్ అని మాజీ మంత్రి సి, రామచంద్రయ్య అన్నారు..

చంద్రబాబు ఒక గేమ్ ఛేంజర్..!
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు ఒక గేమ్ ఛేంజర్ అని, రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్‌ అయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి‌ రామచంద్యయ్య అన్నారు. జగన్ అండ్ బ్యాచ్ రాష్ట్రం‌లో శాంతి భద్రతలకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కడప నివాసంలో విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే అది చంద్రబాబుతో సాధ్యం అవుతుందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు.

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగ పడుతుందని, రాష్ట్రం చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు. 24 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పరుగులు పెడుతున్నారని, నిజంగా ఒక కమిట్మెంట్‌తో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రౌడీ‌లను పెట్టుకుని జగన్ పార్టీ నడుపుతున్నాడని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వంలో ధ్వంసం అయిన వ్యవస్తలు గాడిన పడ్డాయని పేర్కొన్నారు

Read more... తిరుమల ప్రతిష్టకు భంగం.. ఆవేదనతో రిపోర్టు బయటపెట్టిన చంద్రబాబు

ఏపీ కార్మికుల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌

Next Story