- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ కార్మికులకు అదిరిపోయే శుభవార్త
భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 20 లక్షల మంది కార్మికులకు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్మికులకు నైపుణ్యాలు పెంచడం పైన దృష్టి పెట్టాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలు
ఇందులో భాగంగానే కార్మికుల కుటుంబాలలో ప్రసూతికి 20వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అలాగే ప్రతి వివాహానికి 40 వేల రూపాయలు, సహజ మరణానికి 60 వేల రూపాయలు అందించాలని స్పష్టం చేశారు. అంతక్రియలకు గాను 20 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించాలని వెల్లడించారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఏపీలోని కార్మికులకు భారీ ఊరట లభించింది.






