కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తా: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-30 06:31:12  IST  )

తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజా స్వామ్య పద్ధతిలో కూలుస్తానని మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు....

కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తా: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజా స్వామ్య పద్ధతిలో కూలుస్తానని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై అనుచిత వ్యాఖ్యల కేసు విషయంలో కడప జిల్లా(Kadapa District) వేంపల్లి పోలీస్ స్టేషన్‌(Vempalli Police Station)కు వెళ్తూ ఇడుపులపాయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌(Idupulapaya YS Rajasekhara Reddy Ghat)కు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌(Ys Jagan)ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకూ తన పోరాటం ఆగదని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాటం చేస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఒత్తిడితోనే తనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు.

సీఎం అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

Next Story