సీఎం అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-30 06:32:09  IST  )

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. ..

సీఎం అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ సమావేశం... కీలక అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ(Andhra Pradesh State Cabinet) సమావేశం వెలగపూడి(Velagapudi)లోని సచివాలయం(Secretariat)లో జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా అమరావతి(Amaravati) రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన పలు నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేయనున్నారు. ముఖ్యంగా రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ సంస్థలకు భూకేటాయింపులు చేసే అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.

'ట్విన్ టవర్ల' ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

అమరావతిలోని క్వాంటం వ్యాలీలో సుమారు రూ.1,208 కోట్ల భారీ వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక 'ట్విన్ టవర్ల' ప్రాజెక్టుకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. రాజధాని నిర్మాణ వేగాన్ని పెంచడంతో పాటు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.

కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తా: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Next Story