కృష్ణలంక సీఐ సస్పెన్షన్.. సాయికృష్ణ ఉదంతంతో ప్రభుత్వం నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-17 14:15:16  IST  )

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రౌడీ షీటర్ నాగరాజు మిస్సింగ్ ఘటనపై సీరియస్ అయింది. ..

కృష్ణలంక సీఐ సస్పెన్షన్.. సాయికృష్ణ ఉదంతంతో ప్రభుత్వం నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు(Vijayawada Krishnalanka Police Station CI Nagaraju)పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ ఘటనపై సీరియస్ అయింది. ఇప్పటికే సీఐ నాగరాజు వీర్‌కు పంపింది. అయినప్పటికీ చర్యలు సరిపోవని భావించింది. ఈ మేరకు సీఐ నాగరాజుపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నాగరాజు మిస్సింగ్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. పూర్తి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మార్కాపురంలో అదుపులోకి తీసుకుని..

కాగా పలు పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయికృష్ణను ప్రకాశం జిల్లా మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పైగా సాయికృష్ణ గురించి అడిగితే సీఐ నాగరాజు ‘‘నీ కొడుకు చచ్చాడు.. పోలీస్ స్టేషన్‌కు రావొద్దు’’ అని చెప్పారని తల్లి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. సాయి కృష్ణ ఉదంతంపై చర్చించిన సీఎం చంద్రబాబు సీఐపై వేటు వేయాలని డీజీపీని ఆదేశించారు.

Next Story