- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్, బీజేపీ కుట్రల నుంచి ఓటర్ల హక్కులను కాపాడుకోవాలి: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు కుట్రలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, హుజూర్‌నగర్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు కుట్రలకు పాల్పడుతున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతు సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా అమలయ్యాయని, ప్రస్తుతం రైతులు ఎరువులు, సాగునీటి సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ప్రతి కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలి..
బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని, జిల్లాలోని కొందరు అధికారులు సైతం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త ఓటర్ల జాబితాలపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ ఓటర్ల హక్కులను కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై ప్రతి కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫారం-6, 7, 8లతో పాటు మ్యాపింగ్ ప్రక్రియను తెలుసుకుని ఓటర్ల వివరాలను పరిశీలించాలని కోరారు. ఎన్నికల సంఘం 1950 హెల్ప్‌లైన్‌ను అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్, కంచర్ల కృష్ణారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఒంటెద్దు నరసింహారెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, పిల్లుట్ల రఘు, మాజీ మున్సిపల్, చైర్మన్లు వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






