- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్‌కు సహకరించండి: జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
ఎస్ఐఆర్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ కోరారు...

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐఆర్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ కోరారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, అదనపు కమిషనర్ (ఎన్నికలు) కె. చంద్రకలతో కలిసి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో 'ప్రత్యేక సమగ్ర సవరణ' (ఎస్ఐఆర్)పై కర్ణన్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కమిషనర్ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి సమగ్రంగా వివరించారు.పారదర్శకమైన, సమగ్రమైన మరియు లోపాలు లేని ఓటర్ల జాబితాను రూపొందించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వివరాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, కచ్చితంగా సమర్పించడానికి వీలుగా, అర్హులైన ఓటర్లందరికీ ఆంగ్ల భాషలో ఎన్యుమరేషన్ (వివరాల సేకరణ) ఫారమ్‌లను పంపిణీ చేస్తామని తెలియజేశారు.
సవరణ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించాలని, వారి విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని, నిర్ణీత గడువులోగా సరిగ్గా నింపిన ఫారమ్‌లను సమర్పించాలని కమిషనర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.






