చర్లపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

by velandi.Saikiran |

చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేస్-2లో అగ్ని ప్రమాదం జరిగింది.

చర్లపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
X

దిశ , కాప్రా: చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేస్-2లో అగ్ని ప్రమాదం జరిగింది. మెటల్ ఫోర్జింగ్ ఇండస్ట్రీస్ పరిశ్రమలో బుధవారం కార్మికులు పనులు చేస్తుండగా ఈటిట్మెంట్ బాయిలర్ వద్ద మంటలు చేలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి పరిశ్రమలోని మిగతా ప్రాంతాలకు అంటుకున్నాయి. దీంతో అగ్నిమాపక దళానికి సిబ్బంది సమాచారం ఇచ్చారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పి వేసినట్లు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు.

Next Story