- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయదుర్గం భూముల వేలంపై బిగ్ ట్విస్ట్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన SBI
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో భూముల బహిరంగ వేలంపై తెలంగాణ హైకోర్టులో అనూహ్యంగా ఓ పిటిషన్ దాఖలైంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గం (Raidurgam) భూముల వేలం చుట్టూ సరికొత్త లీగల్ వివాదం ముసురుకుంది. రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(SBI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వేలం వేసిన భూమిలో కొంత భాగం తమదేనని పేర్కొంటూ ఎస్‌బీఐ యాజమాన్యం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఎకరం రూ.237 కోట్ల భూమిపై వివాదం
కాగా, గత నెల 28న రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను తెలంగాణ సర్కార్ పబ్లిక్ ఆక్షన్ ద్వారా విక్రయించింది. ఈ వేలంలో ఒక్కో ఎకరం కనీస ధర రూ.170 కోట్ల చొప్పున ప్రభుత్వం నిర్ధారించగా.. ఊహించని విధంగా రికార్డు స్థాయి ధరలు పలికాయి. ఇందులో ఓ ప్లాట్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరా వెంచర్స్ (Gaura Ventures) ఏకంగా ఎకరం రూ.237 కోట్ల చొప్పున వేలంలో దక్కించుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆ 5 ఎకరాలు మావే.. ఎస్‌బీఐ వాదన
రూ.కోట్ల ఆదాయం కోసం ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంపై ఎస్‌బీఐ ఊహించని షాకిచ్చింది. సదరు సర్వే నంబర్ 83/1 పరిధిలోని భూమిలో 5 ఎకరాల స్థలం తమ బ్యాంక్‌కు చెందినదని, దానికి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని ఎస్‌బీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. తమ యాజమాన్యంలో ఉన్న భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా వేలం వేస్తుందని ప్రశ్నిస్తూ, ఈ వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించింది. రూ.కోట్ల విలువైన భూ వివాదానికి సంబంధించిన పిటిషన్‌పై రేపు తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది.






