- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై జగన్ దిగ్భ్రాంతి
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మరణం పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి(Former Minister Gade Venkata Reddy) మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటరెడ్డి.. సుదీర్ఘకాలం పాటు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమించారని కొనియాడారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. శోకసప్తప్తులైన గాదె వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి గాదె వెంకటరెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారని జగన్ గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్(YSR)తో కలిసి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని, ప్రజాక్షేమం కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరమని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.






