- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేటకొడవళ్లతో మొదలై గొడ్డలి వరకు..: మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు వేటకొడవళ్లతో మొదలైన ఆ పార్టీ రాజకీయం, కాలక్రమేణా కత్తిగా మారి, నేడు గొడ్డలి సంస్కృతి వరకు రూపాంతరం చెందిందని ఆయన విమర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr Congress Party) వైఖరిపై మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు వేటకొడవళ్లతో మొదలైన ఆ పార్టీ రాజకీయం, కాలక్రమేణా కత్తిగా మారి, నేడు గొడ్డలి సంస్కృతి వరకు రూపాంతరం చెందిందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం యొక్క బంగారు భవిష్యత్తును కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో ఈ "గొడ్డలి పార్టీ"ని ప్రజలందరూ కలిసికట్టుగా శాశ్వతంగా సమాధి చేయాలని నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.
40 తీర్మానాలు
మహానాడు వేదికగా పార్టీ బలోపేతం, ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా దాదాపు 40 ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించుకోవడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. సభకు వచ్చిన ప్రతి తీర్మానంపైనా నాయకులు, ప్రతినిధులు అత్యంత కూలంకషంగా, సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా ఈ తీర్మానాల రూపకల్పన జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ చరిత్రలో సరికొత్తగా..
పాలకొల్లు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో సరికొత్తగా, మొదటిసారిగా క్లస్టర్ల వారీగా ఈ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని మంత్రి తెలిపారు. క్లస్టర్ల విభజన ద్వారా క్షేత్రస్థాయి శ్రేణులను ఏకం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశామని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ వ్యూహం ఎంతగానో దోహదపడుతుందని నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు.






