- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు అసెంబ్లీకి వైఎస్ జగన్.. గవర్నర్ ప్రసంగం సమయంలో హాజరయ్యే అవకాశం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉదయం గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయన సభలో ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రేపు మధ్యాహ్నం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం కూడా జరగనుంది.
ఉదయం 10 గంటలకు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు. దాదాపు గంట సేపు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమై, సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్
దాదాపు 20 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నెల 14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, సమావేశాల నిర్వహణపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కసరత్తు ప్రారంభించారు. ఈ రోజు డీజీపీ సహా ఉన్నతాధికారులతో భేటీ అయి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అంతకుముందే సీఎస్ విజయానంద్‌తో కలిసి శాఖల వారీగా సభ్యులు అడిగే ప్రశ్నలు, సమాధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.






