- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు అసెంబ్లీకి జగన్ వస్తారు: బొత్స
రేపు అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరవుతారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్: రేపు అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరవుతారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. రేపటి సమావేశానికి జగన్ వస్తారని తెలిపారు. ఎల్లుండి వైసీపీ శాసనసభా పక్ష సమావేశం ఉంటుందనీ స్పష్టం చేశారు. అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం 11:30 గంటలకు స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణపై చర్చించనున్నారు. బీఏసీ సమావేశానికి జగన్‌కు ఆహ్వానం పంపారు. సుమారు 20 పనిదినాల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.






