- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్ స్టాలో పరిచయం.. హోమ్ స్టేలో యువతిపై అత్యాచారం
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ముక్కూ మొహం తెలియనివారితో మాట్లాడటమే చాలా డేంజరస్ పరిస్థితులకు దారితీస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ముక్కూ మొహం తెలియనివారితో మాట్లాడటమే చాలా డేంజరస్ పరిస్థితులకు దారితీస్తోంది. అమ్మాయిలు అబ్బాయిలకు వలపువల వేసి అందినకాడికి డబ్బులు గుంజుకుంటుంటే.. అబ్బాయిలు.. అమ్మాయిలతో హాయ్ యూ లుక్ బ్యూటిఫుల్ అంటూ మాటలు కలిపి, ప్రేమ పేరుతో మోజు తీర్చుకుని వదిలేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన వైఎస్సార్ చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలుకు చెందిన వీర యశ్వంత్ (21) చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. అతనికి ఇన్ స్టాలో తిరుపతి రూరల్ మండలానికి చెందిన బ్యూటీషియన్ గా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య మాటలు పెరిగి స్నేహితులయ్యారు. నాలుగు రోజుల క్రితం నేరుగా కలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరు నుంచి వీర యశ్వంత్ తిరుపతి రామచంద్రనగర్లోని హోమ్ స్టేకు రాగా.. యువతిని కూడా అక్కడికే రమ్మని పిలిచాడు. అతన్ని నమ్మి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పేందుకు భయపడిన ఆమె.. తిరిగి ఇంటికెళ్లింది. యువతి బిహేవియర్లో మార్పును గమనించిన తల్లి ఏమైందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలిపిరి సీఐ రామ్ కిషోర్ తెలిపారు.
READ MORE .....






