మేఘాద్రిగడ్డలో యువకుడి దారుణ హత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-26 10:52:41  IST  )

విశాఖలోని మేఘాద్రిగడ్డ వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మేఘాద్రిగడ్డలో యువకుడి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలోని మేఘాద్రిగడ్డ వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితులు యువకుడి ముఖంపై మద్యంసీసాలతో దాడిచేసి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడు గుంటూరుకు చెందిన కల్యాణ్ చక్రవర్తిగా నిర్ధారించారు. ఆదివారం రాత్రి మేఘాద్రిగడ్డ వద్ద కొందరు యువకులు పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనోజ్, వినోద్ అనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా తేల్చారు.

READ MORE .....

ఇన్ స్టాలో పరిచయం.. హోమ్ స్టేలో యువతిపై అత్యాచారం

Next Story