BREAKING: ఏపీ మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-04 05:46:25  IST  )

రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు ఏపీ మండలి ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

BREAKING: ఏపీ మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మండలి ఛైర్మన్ పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా.. మండలి ఛైర్మన్ మోషేనురాజు వారి రాజీనామాలను ఆమోదించలేదు. దీంతో స్పీకర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నాదు. మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు మొగ్గుచూపగా.. సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగదా అడుగులు వేస్తున్నారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణలు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వైసీపీ ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో.. ఛైర్మన్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లతో విరివిరిగా సమావేశమై రాజీనామాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, స్వతహాగానే రాజీనామా చేస్తున్నట్లు ఇరువురూ తెలిపారు.

ఏపీ అసెంబ్లీ పునః ప్రారంభం.. నేడు సభ ముందుకు మూడు కీలక బిల్లులు

Next Story