- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ అసెంబ్లీ పునః ప్రారంభం.. నేడు సభ ముందుకు మూడు కీలక బిల్లులు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభమయ్యాయి. నేడు ముగ్గురు మంత్రులు సభలో మడు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నాలుగురోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. 13వ రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఏపీపీఎస్సీ (APPSC) చట్టసవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్, అగ్నిమాపక సేవా సవరణ బిల్లును హోంమంత్రి అనిత, జనవిశ్వాస్ నిబంధనల సవరణ బిల్లును ఎన్ఎండీ ఫరూఖ్ లు ప్రవేశపెట్టనున్నారు. ఆయా బిల్లులపై శాఖలవారీగా చర్చలు జరిపిన అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. పరిశ్రమలు, పర్యాటకం, ఆబ్కారీ, రవాణా, కార్మిక, విద్య, ఆరోగ్యం శాఖలపై మంత్రులు చర్చను ప్రారంభించనున్నారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డిలు విద్యుత్, ఆర్అండ్ బీ శాఖల వార్షిక నివేదికలను ప్రవేశపెట్టనున్నారు.
Next Story






