హిట్లర్, తుగ్లక్, ముస్సోలినీ తరహాలో జగన్ ప్రవర్తన.. యనమల తీవ్ర విమర్శలు

by Ramesh Naini |   (  Updated:2026-01-22 07:43:11  IST  )

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర పూర్తిగా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హిట్లర్, తుగ్లక్, ముస్సోలినీ తరహాలో జగన్ ప్రవర్తన.. యనమల తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర పూర్తిగా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం అనే కుర్చీ కోసమే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజల సంక్షేమంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఒక్కసారి అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఐదేళ్ల జగన్ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని యనమల విమర్శించారు. జగన్ పాలనలో అవినీతి, దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు విస్తరించాయని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు.

జగన్‌, వైసీపీని ఇక ఎప్పటికీ నమ్మరు..

జగన్ పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని యనమల పేర్కొన్నారు. జగన్ పేరు చెప్పగానే ప్రజలకు అరాచకం, ధరల పెరుగుదల, సున్నా అభివృద్ధి, ఆర్థిక సంక్షోభమే గుర్తుకొస్తున్నాయని విమర్శించారు. నియంతృత్వ, ఫ్యాక్షనిస్ట్ స్వభావం కలిగిన వ్యక్తి జగన్ అని విమర్శిస్తూ, ఆయన ప్రవర్తన హిట్లర్, తుగ్లక్, ముస్సోలినీ తరహాలో ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని యనమల స్పష్టం చేశారు. ‘జగన్‌ను, వైసీపీని ప్రజలు ఇక ఎప్పటికీ నమ్మరు’ అని తేల్చి చెప్పారు.

Read More : Credit Chori : భూ సర్వే క్రెడిట్‌ చోరీ.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

ఐదేళ్లలో ఏం చేశారని జగన్‌కు క్రెడిట్ ఇవ్వాలి : మంత్రి గొట్టిపాటి

Next Story